Wednesday, March 21, 2012

ఉగాది పండుగ వస్తోంది - ఉత్సాహాన్ని తెస్తోంది Ugadi Panduga Vastondi

ఉగాది పండుగ వస్తోంది
ఉత్సాహాన్ని తెస్తోంది
ఊరంతా సంతోషం
ఉరకలు వేసే సందోహం

ఉప్పు, పులుపు, చెరుకు, చేదు
ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం 
ఉదయం తలంటు పోత
ఉత్సాహం కొత్త బట్టల జత 

ఊరి దేవత సంబరం
ఉత్కంట గొలిపే వినోదం 
ఉగాది పంచాంగ శ్రవణం
ఊరట ఇచ్చే గోచారం వివరం

ఉంది ఉంది మంచి పొంచి  
ఉన్నది గ్రహాల బలం
ఊరికి కొంచెం ఉపకారం 
ఉగ్ర గ్రహాల శాంతికి దానం

ఉన్నత స్థితికి సోపానం
ఉద్వాసన - ఇబ్బందులు మాయం
ఉగాది పండుగ ధ్యేయం 
ఉత్సాహాన్ని పెంచడం

No comments:

Post a Comment